నిరుపేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం: ఉప సభాపతి పద్మారావు గౌడ్
ఆర్.బి.ఎం డెస్క్: నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన CMRF ద్వారా మంజురైన నిధుల మంజూరు పత్రాలు (LOC) లబ్దిదారులకు అందించారు.తకారబస్తీ నివాసం లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.4 లక్షల విలువజేసే LOC పత్రాలను సీతాఫలమంది ప్రాంతానికి చెందిన తిరుమల్లేశ్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన షీలా జోసెఫ్ రూ.2.00 లక్షలు గౌరవ ఉప సభాపతి పద్మ రావు గౌడ్ గారు అందచేశారు .ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.