సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య..
RBM: సంగారెడ్డి జిల్లా పరిధిలోని మెగ్యానాయక్ తండాలో దారుణం చోటుచేసుకుంది. అదే తండాకు చెందిన గోపాలనే వ్యక్తి తొమ్మిదో తరగతి చదువుతున్న తన కుమార్తెను దశరథ్ అనే వ్యక్తి ప్రేమించాడని ఆ వ్యక్తిని అతికిరతకంగా హతమార్చాడు. అనంతరం గోపాల్ నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. కాగా దశరథ్ కు అప్పటికే పెళ్లయిందని తన భర్త గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని దశరథ్ భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తాజాగా దశరథ్ హత్యకు గురైనట్లు తేలడంతో అతని మృతదేహం కోసం గాలిస్తున్నారు
One Comment on “సంగారెడ్డిలో యువకుడి దారుణ హత్య..”