థియేటర్‌ వద్ద గన్‌తో  హల్‌చల్‌..

థియేటర్‌ వద్ద గన్‌తో  హల్‌చల్‌..

ఆర్.బి.ఎం పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలోని థియేటర్ల వద్ద ఒక వ్యక్తి గన్‌తో హల్‌చల్‌ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలైన పూర్ణ, అన్నపూర్ణ థియేటర్లలో స్ర్కీన్ల వద్ద బాలాజీ అనే అభిమాని గన్‌తో హల్‌చల్‌ చేశాడు. థియేటర్ల బయట గన్‌తో తిరగడంతో ప్రేక్షకులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు బాలాజీని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ఫిస్టల్‌, బుల్లెట్లు, ఫిల్లెట్లును స్వాధీనం చేసుకున్నారు. అది బెలూన్లు పేల్చే, పక్షులను కాల్చే డమ్మీ తుపాకీగా పోలీసుల గుర్తించారు. బాలాజీపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.