మోదీతో ఏపీ సీఎం భేటీ..
ఆర్.బి.ఎం డెస్క్ అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప నుండి గన్నవరం విమానాశ్రయం కు చేరుకొని అక్కడినుండి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ లోని స్వగృహంలో సోమవారం విశ్రాంతి తీసుకొని అధికారిక షెడ్యూల్ ప్రకారం మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో సమావేశం అవుతారు. ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, భరత్, వెంకటరమణ, బాలశౌరి ఉన్నారు. ప్రధానమంత్రి మోదీతో సమావేశం ముగిసిన అనంతరం అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ భేటీలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.