వీధి వీధినా సిమెంట్ రోడ్ల నిర్మాణాలు…

వీధి వీధినా సిమెంట్ రోడ్ల నిర్మాణాలు…

ఆర్.బి.ఎం డెస్క్ : వీధి వీధినా సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 15 వ వార్డ్ నందున్న కొత్తపల్లె నుండి కురవపల్లె వరకు రూ 26 లక్షల నిధులుతో చేపట్టిన సిసి రోడ్డు, కురవపల్లె నుండి మదనపల్లె రహదారి వరకు రూ 23 లక్షలుతో చేపట్టిన సిసి రోడ్లును ఎం ఎల్ సి జకీయా ఖానం, జెడ్ పి మాజీ వైస్ చైర్మన్ దేవనాధ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా,వైస్ చైర్మన్ లు దశరథ రామిరెడ్డి, ఫయాజుర్ రెహమాన్ లతో కలసి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. సిమెంట్ రోడ్ల ప్రారంభాలకు విచ్చేసిన చీఫ్ విప్ కు మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, కౌన్సిలర్ చంద్రశేఖర్ ల ఆధ్వర్యంలో ఆత్మీయ స్వాగతం పలికారు. నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను, ఎగువ అబ్బవరం, హరిజన వాడ, కొత్తపల్లె, కురవపల్లె, రాయుడు కాలనీలను కలిపే లింక్ ఫార్మేషన్ రోడ్డు పనులను పరిశీలించి శ్రీకాంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సచివాలయ అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆయన ఆరా తీశారు.ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజల మన్ననలను పొందాలని శ్రీకాంత్ రెడ్డి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏ ఈ కృష్ణారెడ్డి, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి, అఖిలభారత వెనుకబడిన వర్గాల ఫోరం కన్వీనర్ వండాడి వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యాయవాది జగన్నాధ రెడ్డి, బేపారి మహమ్మద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ లు చెన్నూరు అన్వర్ బాషా, విజయభాస్కర్,ఆసీఫ్ అలీఖాన్, గువ్వల బుజ్జిబాబు, వెంకట్రామిరెడ్డి, సహదేవ రెడ్డి, జయపాల్ రెడ్డి,శంకరయ్య, రెడ్డెప్పరెడ్డి, టిక్కు రమణ, నాగరాజు, విజయశేఖర్, చింటు, దుగ్గిరెడ్డి సాంబ, హరిప్రసాద్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *