బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ ను సత్కరించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

బీసీ కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ ను సత్కరించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: బిసి కమిషన్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన కిషోర్ గౌడ్ ను ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ బుధవారం సత్కరించారు. సికింద్రాబాద్ లోని తన నివాసం లో కలిసిన కిషోర్ గౌడ్ డిప్యూటీ స్పీకర్ అభినందించి సన్మానించారు. ఈ సందర్బంగా ఉపసభాపతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ తెరాస పార్టీలో కష్టపడేవారికి కచ్చితంగా గుర్తింపు వస్తుందని కొన్ని సందర్భాలలో ఆలస్యం కావొచ్చని కానీ కచ్చితంగా వారి శ్రమకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిఫలం ఇస్తారని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. ఇచ్చిన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహించాలని కిషోర్ గౌడ్ కు పద్మారావు గౌడ్ సూచించారు.ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతను సంక్రమంగా నిర్వహించాలని పద్మారావు గౌడ్ కిషోర్ గౌడ్ కు తెలిపారు.ఈ క్రమంలో కిషోర్ గౌడ్ కు పద్మారావు గౌడ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసిఉద్దీన్, అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాన్ని ప్రస్సన్న శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.