ఏపీ సీఎం జగన్ మోదీకి లేఖ..
ఆర్.బి.ఎం డెస్క్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి వాక్సిన్ నేపద్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 18 ఏళ్ళ నుండి 44 ఏళ్ళ వారికి వాక్సిన్ పంపిణీ చేయడానికి కేంద్రం సరిపడా డోసులు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రుల్లో వాక్సిన్ ధరను ఇష్టానుసారంగా నిర్ణయిస్తారని ప్రైవేటు హాస్పిటల్స్ కు వాక్సిన్ సరఫరా చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదని జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రైవేటు హాస్పిటల్స్ కు వాక్సిన్ సరఫరా చేయడంతో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని మోదీకి రాసిన లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వాక్సిన్ ల నేపద్యంలో ఇప్పటికే పలుమార్లు జగన్ మోహన్ రెడ్డి మోదీకి లేఖలు రాశారు
