వాళ్ల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సింగర్ మధుప్రియ..

వాళ్ల పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సింగర్ మధుప్రియ..

ఆర్.బి.ఎం డెస్క్: సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సింగర్ మధుప్రియ. తనను సోషల్ మీడియాలో కొందరు అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు మధుప్రియ ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమంలో తనకు ఇబ్బంది కల్గించే సందేశాలు పంపిస్తున్నారని, గడిచిన రెండు రోజు లుగా బ్లాంక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఈమేరకు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అపరిచిత వ్యక్తుల నుండి వస్తున్న బ్లాంక్ ఫోన్ కాల్స్ తో తను మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో తనను వేధిస్తున్న అపరిచిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని మధుప్రియ సైబరాబాద్ క్రైమ్ పోలీసులని కోరింది.

Leave a Reply

Your email address will not be published.