కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మండిపడ్డ మధుయాష్కీ గౌడ్.. పార్టీలో నుండి బయటికి….
ఆర్.బి.ఎం డెస్క్: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎదుగుదలకు కారణమని మధుయాష్కి గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి లెక్కచేయకుండా సమ్మేళనానికి హాజరుకావడం కాంగ్రెస్ పార్టీని నష్టపర్చడమేనని మధుయాష్కిగౌడ్ కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారు.
విజయమ్మ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్థిస్తారా అంటూ మధుయాష్కిగౌడ్ కోమటిరెడ్డినీ నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించకూడదు అంటూ మధుయాష్కి గౌడ్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చురకలు అంటించారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే కొనసాగవచ్చు లేదా బయటికి పోవచ్చు కానీ పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడవద్దు అంటూ మధుయాష్కిగౌడ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిపారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ములుగు ఎమ్మెల్యే సీతక్క పై చేసిన వ్యాఖ్యలను మధుయాష్కిగౌడ్ ఖండించారు.