కల్వకుంట్ల కవిత మాట తప్పారు: అర్వింద్‌,నిజామాబాద్‌ ఎంపీ

కల్వకుంట్ల కవిత మాట తప్పారు: అర్వింద్‌,నిజామాబాద్‌ ఎంపీ

ఆర్.బి.ఎం నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని నిజాంషుగర్స్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత ఆరేళ్లుగా ఫ్యాక్టరీ మూతపడడంతో వేతనాలు లేక.. కుటుంబాలను పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బోధన్‌లోని నిజాంషుగర్స్‌ను తెరిపిస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత సైతం కార్మికులకు వేతనాలు ఇప్పించే బాధ్యత తనదేనని కార్మికులకు ఇచ్చిన మాట తప్పారని అర్వింద్‌ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published.