సూపర్ స్టార్ మహేష్ బాబు నివాసం వద్ద భారీ భద్రత..

సూపర్ స్టార్ మహేష్ బాబు నివాసం వద్ద భారీ భద్రత..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా మహమ్మారితో దేశం మొత్తం గడగడలాడుతోంది. సామాన్యుడి నుండి మొదలుకొని సెలెబ్రిటీలను వదలని కరోనా. కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో సూపర్ స్టార్ మహేష్ బాబు అప్రమత్తమయ్యారు. అయితే తాజాగా నగరంలోని మహేష్ బాబు నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహేష్ బాబు నివాసంలో పని చేసేవాళ్లు మినహా మిగితావారికి ప్రవేశం లేకుండా ఏర్పాట్లు చేశారు. మహేష్ బాబు నివాసంలో పని చేసేవారికి కరోనా టెస్ట్ చేసిన అనంతరం లోపలికి అనుమతినిస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు మొదటి డోస్ వాక్సిన్ తీసుకున్నారు. ఈ క్రమంలో తమ నివాసంలో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.  కరోనా విజృంభణ నేపథ్యంలో మహేష్ బాబు తన సినిమా షూటింగ్లను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం తెలిసిందే. కాగా మహేష్ తన సినిమాలకు సంబంధించిన దర్శకులతో ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published.