చిన్న సమస్య విడాకులకు దారితీసింది: అక్కినేని నాగార్జున

akkineni nagarjuna nagachaithanya samanta divorce

చిన్న సమస్య విడాకులకు దారితీసింది: అక్కినేని నాగార్జున

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: హీరో నాగచైతన్య, సమంత విడాకులపై సినీ పరిశ్రమలోనే కాకుండా ఇతర రంగాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ జంట ఎందుకు విడాకులు తీసుకుంది. అసలు కారణం ఏమిటనే ఇప్పటికీ స్పష్టమైన క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో నాగచైతన్య, సమంత విడాకులపై అనేక పుకార్లు చికార్లు చేస్తున్నాయి. నాగచైతన్య, సమంత విడాకులపై హీరో నాగార్జున మొదటిసారి స్పందించారు. ‘‘ నాగచైతన్య, సమంత ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. గత ఏడాది ఇద్దరూ కొత్త సంవత్సర వేడుకలు సంతోషంగా చేసుకున్నారు. ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చింది. సమంతే ముందుగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె నిర్ణయానికి నాగచైతన్య అంగీకారం తెలిపాడు’’ అని నాగార్జున వెల్లడించాడు.

విడాకులతో ఇద్దరం హ్యాపీగా ఉన్నామని ‘బంగార్రాజు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా అడిగిన ఈ ప్రశ్నకు నాగచైతన్య సమాధానమిచ్చాడు. ఇద్దరి మంచి కోసమే తీసుకున్న నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. కెరీర్‌పరంగా కూడా సంతోషంగా ఉన్నామని, ఆ సమయంలో కుటుంబమంతా తనకు అండగా నిలిచిందని నాగచైతన్య తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published.