‘పొన్నియన్‌ సెల్వన్‌’కలెక్షన్ల ప్రభంజనం

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పొన్నియన్‌ సెల్వన్ సినిమా శుక్రవారం విడుదలై ఘన విజయం సాధించింది. ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకుల దక్షిణాదితో పాటు ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లెజండరీ డైరెక్టర్‌ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. మణిరత్నం ఈ చిత్రాన్ని కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా తెరకెక్కించాడు. మణిరత్నం దశాబ్ధ కాలం క్రీతమే మొదలు పెట్టిన ఈ సినిమా పలు కారణాలతో షూటింగ్‌ కూడా ఆగిపోయింది. చియాన్ విక్ర‌మ్‌, కార్తి, జయం రవి, ఐశ్వ‌ర్య‌రాయ్‌, త్రిష, బాబీ సింహా వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటించడంతో విడుదలతకు ముందే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. అంతేకాకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లను చూస్తే..

మొదటి రోజు ఈ చిత్రం రూ. 41.80 కోట్లు రాగా, తెలుగులో ఈ చిత్రానికి దాదాపు రూ.10 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది. ఫస్ట్‌ డేన ఈ చిత్రం రూ.2.88 కోట్లను కలెక్ట్‌ చేసింది.‘పొన్నియన్‌ సెల్వన్‌-1’ చిత్రానికి వరల్డ్‌ వైడ్‌గా రూ.130 కోట్ల వరకు థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగింది.
తమిళనాడు : 25.85 కోట్లు
తెలంగాణ+ఏపి : 5.50 కోట్లు
కర్ణాటక : 4.05 కోట్లు
కేరళ : 3.20 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.60 కోట్లు
ఓవర్సీస్‌ : 39.10 కోట్లు
టోటల్‌ వరల్డ్‌ వైడ్‌ : 80.30 కోట్లు( 41.80 కోట్లు షేర్‌)

Leave a Reply

Your email address will not be published.