నాగచైతన్య,సమంత విడాకులకు కారణం ఆ సినిమాలు చేయడమేనా?

నాగచైతన్య,సమంత విడాకులకు కారణం ఆ సినిమాలు చేయడమేనా?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నాగ చైతన్య, సమంత వివాహబంధంపై ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. ఇన్ని రోజులు కలిసి ఉన్నామని, చర్చించుకుని విడిపోదామని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. అయితే వీరి వివాహ బంధానికి అక్టోబర్ 7కు నాలుగేళ్లు పూర్తి అవుతుంది. వారి స్నేహానికి పదేళ్లు. పెళ్లికి ముందు టాలీవుడ్‌లో సమంత ఓ వెలుగు వెలిగింది. పెళ్లి తర్వాత కూడా ఆమెకు క్రేజ్ మాత్రం తగ్గలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సమంత కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ అందరి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత ఆమె బోల్డ్ రోల్స్ కారెక్టర్స్ చేయడం అక్కినేని కుటుంబం ఇబ్బంది పడిందట. ఈ పాత్రల విషయంలో ఆమెను ఆ కుటుంబం మందలించదనే ప్రచారం జరిగింది. అయినా ఆమె నిబంధనలను పట్టించుకోలేదని సినీ వర్గాలు చెబుతున్న మాట. ఈ వివాదం చిలికి గాలి వానలా మారి విడాకులకు దారి తీసిందని పలువురు చెబుతున్నారు. పదేళ్ల స్నేహ బంధం, నాలుగేళ్ల వివాహబంధాన్ని తెంచుకుని నాగ చైతన్య, సమంత విడాకలు తీసుకోవడం అందరూ విస్మయానికి గురవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *