బాలక్రిష్ణ అది మనసులో పెట్టుకోకుండా విష్ణుకు మద్దతు ఇచ్చాడు: మోహన్ బాబు

బాలక్రిష్ణ అది మనసులో పెట్టుకోకుండా విష్ణుకు మద్దతు ఇచ్చాడు: మోహన్ బాబు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: మంచు మోహన్ బాబు ఈరోజు ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చినట్లు సమాచారం. భేటీ అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ అన్న నందమూరి తారకరామారావు గారే నన్ను ఈ రోజు బాలక్రిష్ణ నివాసానికి పంపినట్లు ఉందని ఆయన అన్నారు. బాలక్రిష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి అని ఆయనను కలవడం సంతోషంగా ఉందని మోహన్ బాబు అన్నారు. ఇటీవల జరిగిన మా ఎన్నికల నేపథ్యంలోనే బాలక్రిష్ణతో భేటీ అయ్యానని మోహన్ బాబు తెలిపారు. మా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణు 16వ తేదీన ప్రమాణస్వీకారం చేస్తుండడంతో దానికి బాలకృష్ణను ఆహ్వానించమని మోహన్ బాబు అన్నారు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేసిన బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ ను ఓడించేందుకు ప్రచారం చేశానని బాలక్రిష్ణ అవేవి మనసులో పెట్టుకోకుండా మా అధ్యక్ష బరిలో ఉన్న విష్ణుకు మద్దతుగా ఉండి విష్ణును గెలుపించడం పట్ల మోహన్ బాబు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.