సెప్టెంబర్ 3న అప్పుడు ఇప్పుడు విడుదల

సెప్టెంబర్ 3న అప్పుడు ఇప్పుడు విడుదల

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: సుజన్, తనీష్క్ హీరో హీరోయిన్లుగా యు.కె.ఫిలింస్ బేనర్ పై ఉషారాణి కనుమూరి, విజయ రామకృష్ణం రాజు నిర్మాత‌లుగా చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం `అప్పుడు-ఇప్పుడు`. శివాజీరాజా, పేరుపు రెడ్డి శ్రీనివాస్, చైతన్య ముఖ్య పాత్రల్లొ నటిస్తున్నారు. ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్ రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది . ఇటీవల దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లేటెస్ట్ గా మూవీ టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల అవుతున్న సందర్బంగా

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ “ఇటీవలే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వనాధ్ గారు విడుదల చేసిన సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే పూరి జగన్నాద్ గారు విడుదల చేసిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం, అలాగే శ్రీకాంత్ గారు, సునీల్ గారు విడుదల చేసిన సాంగ్స్ కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇలా వీరంతా మా సినిమాకు మంచి సపోర్ట్ అందించారు.

ఈ టీజర్ తో అభిమానుల్లో కానీ అటు ట్రేడ్ వర్గాల్లో మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు చలపతి చాలా అద్భుతంగా తెరకెక్కించాడు . అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకుని వచ్చే నెల 3న విడుదల చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – “మా `అప్పుడు-ఇప్పుడు` చిత్రం టీజర్, సాంగ్స్ మంచి పాపులర్ అయ్యాయి. ఇది ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎంటర్ టైనర్. హీరో హీరోయిన్లు కొత్తవారే అయినా పూర్తి సహకారం అందించారు. మేకింగ్ లో ఎక్కడా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాం. కళ్యాణ్ సమి విజువల్స్, పద్మనావ్ భరద్వాజ్ సంగీతం మా సినిమాకు మంచి అసెట్ అన్నారు.

నటీనటులు : సుజన్, తనీష్క్ ,శివాజీరాజా, శ్రీనివాస్ పేరుపురెడ్డి, మాధవి, జబర్దస్త్ అప్పారావు తదితరులు
సినిమాటోగ్రఫీ : కల్యాణ్ సమి,
ఆర్ట్: ఠాగూర్,
లిరిక్స్ః చిరావూరి విజయకుమార్,
ఎడిటింగ్: వి.వి.ఎన్.వి.సురేష్ ,
సంగీతం: పద్మానావ్ భరద్వాజ్,
నిర్మాతలు: ఉషారాణి కనుమూరి, విజయ్ రామ కృష్ణమ్ రాజు,
దర్శకత్వం: చలపతి పువ్వల.
పిఆర్ : సతీష్, పర్వతనేని

Leave a Reply

Your email address will not be published.