తెలంగాణ హైకోర్టు నూతన చీఫ్ జస్టిస్‌గా ఎంఎస్ రామచంద్రరావు..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ హై కోర్ట్ నూతన చీఫ్ జస్టిస్‌గా సత్యరత్న రామచంద్రరావు నియామకం అయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి తెలంగాణ హై కోర్ట్ చీఫ్ జస్టిస్‌గా సత్యరత్న రామచంద్రరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
జస్టిస్ సత్యరత్న రామచంద్రరావు హైదరాబాద్ కు చెందినవారే. సత్యరత్న రామచంద్రరావు 1966 ఆగష్టు 7 వ తేదీన హైద్రాబాద్లో జన్మించారు. సత్యరత్న రామచంద్రరావు తన పదవ తరగతి హైద్రాబాద్లోని సెయింట్ పాల్స్ హైస్కూల్‌లో పూర్తిచేశారు. రామచంద్రరావు తన ఇంటర్ లిటిల్ ఫ్లవర్ కాలేజీలో, బీఎస్సీ భవన్స్ న్యూ సైన్స్ కాలేజీలో పూర్తి చేశారు .సత్యరత్న రామచంద్రరావు 1989లో ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్టా తీసుకున్నారు. సత్యరత్న రామచంద్రరావు అడ్వకేట్‌గా తన పేరును 1989, సెప్టెంబర్ నెలలో నమోదు చేసుకున్నారు. యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 1991లో సత్యరత్న రామచంద్రరావు తన ఎల్ఎల్ఎం పట్టా సాధించారు. 2012 జూన్ 29న ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా సత్యరత్న రామచంద్రరావు నియమితులయ్యారు.న్యాయమూర్తిగా 2013 డిసెంబర్ 4 నుంచి సత్యరత్న రామచంద్రరావు కొనసాగుతున్నారు.