తల్లి టీవీ ఆఫ్ చేసినందుకు బాత్రూంలో ఉరేసుకొని ఆత్మ హత్య..

తల్లి టీవీ ఆఫ్ చేసినందుకు బాత్రూంలో ఉరేసుకొని ఆత్మ హత్య..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వాలు తాత్కాలికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికి తెలిసిందే. కాగా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ స్వగృహాలలోనే క్లాసులకు హాజరౌతున్నారు. అయితే ఆన్లైన్ క్లాసు అయిపోయిన తర్వాత తమ ఇంట్లోనే టీవీ వద్దకు వెళ్లి పడుకొని టీవీ చుసిన 19 ఏళ్ల కొడుకు తనను ఆలా చుసిన తల్లి వెంటనే టీవీ ఆఫ్ చేయడంతో దానికి ఆ బాలుడు తీవ్ర మనోవేదనకు గురై ఇంట్లోని బాత్రూమ్ లోకి వెళ్లి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తహసిల్‌ పరిధిలోని వకిల్‌వాడి ప్రాంతంలో నేడు ఉదయం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలం కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *