కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హాట్ బ్యూటీ షకీలా..

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న హాట్ బ్యూటీ షకీలా..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కుర్రకారును ఉర్రుతలూగించి  అపారమైన అభిమానాన్ని సంపాదించుకున్న హాట్ బ్యూటీ షకీలా. షకీలా పేరు తెలియని యువత ఉండరు అని చెప్పకనే చెపొచ్చు. షకీలా అప్పటి తరాన్ని కవ్వించి సెగలు రేపిన నటి. 200కు పై సినిమాల్లో నటించి అప్పటి ఇప్పటి యువత హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. తాజాగా నటి షకీలా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీలు విసృతంగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. అయితే నటి షకీలా ఓటర్లను ఎలా తన వైపు తిప్పుకుంటారు అనే అంశం చర్చనీయంగా మారింది. 18 ఏళ్లకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 200కు పైగా సినిమాలు ఆమె నటించారు. షకీలా జీవితం ఆధారంగా ఒక సినిమా తీస్తున్న విషయం తేలిసిందే.

Leave a Reply

Your email address will not be published.