తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర నటుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా రాజకీయాలపై స్పందించారు. ఏ పార్టీ రాజకీయనాకులైన ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలనీ ఆలా కాకుండా ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదని పవన్ కళ్యాణ్ అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం స్టాలిన్ పరిపాలన, వారి ప్రభుత్వం పని తీరు వారి రాష్ట్రానికే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల,రాజకీయ పార్టీలకు మార్గదర్శం అని పవన్ కళ్యాణ్ స్టాలిన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.