ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ రెడ్డి కలిసి ఒకే వేదికపై పోరాటాలు చేయబోతున్నారా?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రేవంత్ రెడ్డి కలిసి ఒకే వేదికపై పోరాటాలు చేయబోతున్నారా?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ఒక వైపు ప్రతిపక్షాలన్నీ మరోవైపు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల టార్గెట్ సీఎం కేసీఆరే. ఈ పార్టీల అధినేతలు ప్రగతిభవన్‌లో మకాం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు గ్రామస్థాయిలో నిర్మాణాలున్నాయి. ఈ రెండు పార్టీలు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమంటే అని చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో బీఎస్పీ నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గతంతో బీఎస్పీకి క్యాడర్ ఉన్నప్పటికీ బలంగా శక్తిగా అవతరించలేదు. ఇటీవల మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విమరణ చేసి బీఎస్పీల చేరారు. ఆ పార్టీకి ప్రవీణ్‌కుమార్ పునరుజ్జీవనం తెచ్చారు.

అందరి ఊహాగానాలను తలకిందులు చేస్తూ నల్గొండ భారీ భహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రవీణ్‌కుమార్ ప్రసంగమంతా కేసీఆరే కేంద్రంగా సాగించింది. ‘ఏనుగెక్కి ప్రగతి భవన్‌ పోదామా.. కారు కింద పడిపోదామా’అనే నినాదం ప్రకంపనలు సృష్టించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ వ్యాప్తంగా సమావేశాలను ఏర్పాటు చేస్తూ పార్టీ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీపై ప్రవీణ్‌కుమార్ తీవ్రమైన విమర్శలు చేయడం లేదనే వాదన కూడా ఉంది.

ఇటీవల మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి వ్యాఖ్యలను బీజేపీ తప్పా మిగతా పార్టీలు ఖండించాయి. ప్రవీణ్‌కుమార్ కూడా మల్లారెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. మంత్రి పదవి ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ఇదే సమయంలో కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలలో దళిత దండోరా యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి నిరహారదీక్ష చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అరాచాకాలతోనే ప్రవీణ్‌కుమార్ స్వచ్చంద పదవీవిమరణ చేశారని చెప్పారని, సానుభూతి వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరూ ఒకరిఒకరు రెండు మూడు రోజుల వ్యవధిలో సానూభూతిగా మాట్లాడారు.

కాంగ్రెస్, బీఎస్పీ ప్రధాన టార్గెట్ కేసీఆర్ కావడంతో భవిష్యత్తులో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసే అవకాశాలున్నాయనే చర్చ ప్రారంభమైంది. ఎందుకంటే కాంగ్రెస్, బీఎస్పీలు కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా చేస్తున్నాయి. బీజేపీ మతతత్వ పార్టీగా ముద్రపడడంతో బీఎస్పీ ఎంతమాత్రమూ ఆ పార్టీతో పనిచేసే ప్రసక్తి లేదు. అందువల్ల తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దింపాలంటే కాంగ్రెస్, బీఎస్పీ ఉమ్మడి వేదికగా పనిచేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయనే చర్చ జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.