రంగారెడ్డి: జిల్లాలో రోడ్డు ప్రమాదాలు హడలెత్తున్నాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస రోడ్డు ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి అక్కడిక్కడే మృతి చందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనాన్ని అతివేగంతో కారు ఢీ కొట్టింది. అక్కడి కారు నుంచి కారు పరారైంది. అలాగే అత్తాపూర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 126 వద్ద మరో ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రంగారెడ్డి జిల్లాలో హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు
