సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత

హైదరాబాద్: సూపర్‌స్టార్ కృష్ణ(80) కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కృష్ణ మొదటి భార్య ఇందిరాదేవి, కొంతకాలం క్రితం రెండో భార్య విజయనిర్మల, పెద్దకుమారుడు రమేశ్‌బాబు మృతి చెందారు. కృష్ణకు ఇద్దరు కుమారులు రమేశ్‌బాబు, హీరో మహేశ్‌బాబు, ఇద్దరు కూతుళ్లు పద్మజ, మంజుల, ప్రియదర్శిని. 1942 మే 31న సూపర్‌స్టార్ కృష్ణ జన్మించారు. కృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం. 1965లో తేనెమనసులు సినిమాతో హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. గూఢచారి 116తో సినిమాతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రతో సంచలనం సృష్టించారు. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, ఈనాడు, అగ్నిపర్వతం, పాడిపంటలు, తెలుగువీర లేవరా, సాహసమే ఊపిరిగా సినిమాలతో తనకుంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఈయన ఏడాదికి 10 సినిమాలు.. 3 షిఫ్టుల్లోనూ పనిచేశారు. ఆయన 340 పైగా సినిమాల్లో నటించారు. ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, భారత ప్రభుత్వం ద్వారా పద్మభూషణ్‌ పురస్కారాలు కృష్ణను వరించాయి. కృష్ణ పేరుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం పోస్టల్‌ స్టాంప్ విడుదల చేసింది. రాజీవ్‌గాంధీ ప్రోత్సాహంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఏలూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.

Leave a Reply

Your email address will not be published.