వికారాబాద్ జిల్లాలో భూకంపం..

వికారాబాద్ జిల్లాలో భూకంపం..

ఆర్.బి.ఎం డెస్క్: వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రంగాపూర్ తండాలో భయంకరమైన శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైయ్యారు. రెండు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపించింది. ఈ క్రమంలో ప్రజలు భయంతో ఇళ్ళ నుండి బయటకు పరుగులు పెట్టారు. భారీ శబ్దం రావడంతో గ్రామస్థులు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు గ్రామానికి చేరుకొని ఆ శబ్దం భూకంపమా లేదా ఇంకా మరేమిటని అరా తీస్తున్నట్లు సమాచారం..

 

Leave a Reply

Your email address will not be published.