ఉప్పర్‌పల్లిలోని ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్ లో వాహనాల వేలం..

ఉప్పర్‌పల్లిలోని ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్ లో వాహనాల వేలం..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: పలు కేసుల్లో పట్టుబడ్డ వాహనాలు వేలం వేస్తున్నట్టు శంషాబాద్ ఎక్సైజ్‌ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు ప్రకటించారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం వివిధ కేసులో పట్టుబడ్డ రెండు వాహనాలను ఈ నెల 22 న ఉప్పర్‌పల్లిలోని ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఉదయం 11 గంటలకు వేలం ప్రారంభం అవుతుందని దానికి సంబంధిచిన ఏర్పాట్లు చేస్తున్నట్లు అయన తెలిపారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునేవారు ఉప్పర్‌పల్లిలోని ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్ లో తమ పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ వేలంలో టివిఎస్‌ జూపిటర్‌ మోటర్‌ సైకిల్, టిఎస్‌07ఈకే5988 ఆశోక్‌ లేలాండ్‌ గూడ్స్‌ వాహనం టిఎస్‌30టి 8261 వాహనాలు వెల్లంలో ప్రవేశపెడ్తున్నట్టు అయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.