షర్మిల తన పార్టీలో చేరితే 10 వేల కోట్లు ఇస్తాను అన్నది: కొండా సురేఖ
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువస్తానని తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. రోజు ఎదో ఒక సందర్భంలో కెసిఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్తూనే ఉన్నారు షర్మిల. తాజాగా నిరుద్యోగుల కోసం మూడు రోజులపాటు దీక్ష కూడా చేపట్టారు షర్మిల.ఈ క్రమంలో బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. కచ్చితంగా ఎదోఒక్కరోజు సీఎం అవుతానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో షర్మిల దీక్షకు పలు కుల సంఘాలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తన వెంట నడవాలని అక్కగా అన్ని తానై అందరికి న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు నాయకులూ షర్మిలతో నడవడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో షర్మిల వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమాలను పెద్ద నాయకులను కలుస్తునట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నాయకులూ షర్మిలకు తన వెంట నడవడానికి మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో మాజీ మంత్రి కొండా సురేఖను కూడా పార్టీలోకి రావాలి అని కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా సురేఖ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. షర్మిల పార్టీలోకి వెళితే 10 వేల కోట్లు ఇస్తా అన్నది అని సురేఖ అన్నారు. కానీ తాను మాత్రం తన కాంగ్రెస్ ను వదలి ఎక్కడి పోయేది లేదని స్పష్టం చేసింది.