మాదకద్రవ్యాలు తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్
హైదరాబాద్: నగరంలో మళ్లీ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తుల పట్టివేత. నైజీరియకు చేందిన ఇద్దరిని అదుపులోకి తిసుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.104 గ్రాముల కొకైన్ లక్షా 64 వేల నగదును వారి నుండి స్వాధీనం చేసుకున్నరు. నైజీరియకు జోడిపాస్కెల్ అతని గార్ల ఫ్రెండ్ మోనికలను అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో ముగ్గు ఉన్నట్లు వారు ప్రస్తుతం పరారీలో ఉన్నరని అధికారులు తెలిపారు.నైజీరియకు చెందిన మోనిక ముంబాయి నుండి నాలుగు రోజుల క్రింద నగరానికి చేరుకుందని హైదరాబాద్ పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు అధికారు వెల్లడించారు. తార్నాకలోని నాగార్జున కాలనీలో జోడిపాస్కెల్, మోనిక నివాసం ఉంటారని అధికారులు తెలిపారు.విరి ఇద్దరిని తార్నాక సర్కిల్ వద్ద ఎక్సైజ్ ఎన్ ఫొర్స్ మెంట్ అధికారులు అదుపులోకి తిసుకున్నరు.