నస్కల్ గ్రామంలో విషాదం..

నస్కల్ గ్రామంలో విషాదం..

ఆర్.బి.ఎం వికారాబాద్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లాలోని నస్కల్ గ్రామానికి చెందిన ఖాజా, మోహన్, అంజయ్య రోజులనే కూలిపని కోసం వికారాబాద్ వెళ్లే క్రమంలో వికారాబాద్ వైపు నుండి అతి వేగంగా వస్తున్న కారు బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఖాజా, మోహన్ ఘటన స్థలంలోనే మృతిచెందగా మరో వ్యక్తి అంజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అంజయ్య తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటనతో నస్కల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.