ఓటునోటు కేసులో ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి..

ఓటునోటు కేసులో ఏసీబీ కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఈ రోజు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు సంబంధించి ఆయనతో పాటు సెబాస్టియన్‌,ఉదయ్‌సింహా నాంపల్లి ఏసీబీ కోర్ట్ కు హాజరయ్యారు.ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన పలువురు సాక్షుల వాంగ్మూలాన్ని కోర్ట్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పీఏ సైదయ్య, వేం నరేందర్‌రెడ్డి కుమారుడు కృష్ణ కీర్తన్‌రెడ్డిల వాంగ్మూలాలను నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టు గురువారం నాడు నమోదు చేసింది. గురువారం నాడు నరేందర్‌రెడ్డి బంధువుతోపాటు మరొకరు విచారణకు హాజరయ్యారు. ఏసీబీ కోర్ట్ వీరి వాంగ్మూలాలను నమోదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *