రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాతే మలిదశ ఉద్యమం మొదలైంది: వైఎస్ షర్మిల

రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాతే మలిదశ ఉద్యమం మొదలైంది: వైఎస్ షర్మిల

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాతే తెలంగాణలో మలిదశ ఉద్యమం మొదలైందని వైఎస్ షర్మిల మీడియా సమావేశంలో అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత శ్రీకాంత చారి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆత్మ హత్య చేసుకున్న మొదటి వ్యక్తి అని వైఎస్ షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన అనంతరం రాష్ట్ర ప్రజలు ఎంతో భయానికి గురైయ్యారు అని ఆమె అన్నారు. అప్పటి ఉమ్మడి రాష్ట్రము కుక్కలు చింపిన విస్తర్ల మారుతోందని ప్రజలు భయాందోళనకు గురైయ్యారు  . వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నపుడు తెలంగాణ ఉద్యమం ప్రస్తావన ఎందుకు రాలేదని షర్మిల అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నపుడు ఇప్పటి ప్రభుత్వానికి ఆనాడు పట్టుమని 10 సీట్లు కూడా రాలేవని ఆమె అన్నారు.

తెలంగాణ సెంటిమెంట్ ను కెసిఆర్ కుటుంబం బాగా వాడుకున్నారని ఆమె అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత మందికి లబ్ది చేకూరిందని ఆమె అన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను తన గుండెలో పెట్టుకొని చూసుకున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. తెలంగాణ కు రాజశేర్ రెడ్డి ఎప్పుడు వ్యతిరేకి కి కాదని ఆమె అన్నారు. తమ కుటుంబం కూడా తెలంగాణ కు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని షర్మిల అన్నారు.

Leave a Reply

Your email address will not be published.