బీసీ కమిషన్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్యమ వీరుడు శుభప్రద్ పటేల్..

బీసీ కమిషన్ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్యమ వీరుడు శుభప్రద్ పటేల్..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్ బీసీ కమిషన్ కార్యాలయంలో బీసీ కమిషన్ మెంబర్ గా శుభప్రద్ పటేల్ పదవీ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించారు. శుభప్రద్ పటేల్ ప్రమాణ స్వీకారానికి మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రంజిత్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ లింగయ్య యాదవ్,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, కాలేరు వెంకటేష్, కార్పొరేషన్ ఛైర్మన్ లు బాలమల్లు, నాగేందర్ గౌడ్, వాసుదేవ రెడ్డి మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, వికారాబాద్ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, వివిధ కోర్టుల న్యాయవాదులు, ఓయూ విద్యార్థి జేఏసీ నేతలు హాజరై అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని బీసీలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా పని చేస్తానని శుభప్రద్ పటేల్ అన్నారు. బీసీ కమీషన్ మెంబెర్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తనకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని శుభప్రద్ పటేల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.