మానసికంగా ముందుకు సాగాలి: మంత్రి హరీష్ రావు
ఆర్.బి.ఎం డెస్క్: ఈ విపత్కర సమయంలో ప్రతి ఒక్కరు దైర్యం కోల్పోకుండా మనోధైర్యం తో ముందుకు నడవాలని మంత్రి హరీష్ రావు కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ తో కలిసి శనివారం కోవిద్ కేర్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రాంభించారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ ను అయన ప్రసంశించారు. కల్వరి టెంపుల్ ను ప్రజల కోసం కోవిద్ కేర్ సెంటర్ గా మార్చడం అభినందనీయం అని అన్నారు. కోవిద్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం ప్రజలు తగు జాగ్రత్తులు పాటిస్తూ, కరోనా సోకినట్టు ఏమైనా అనుమానం వస్తే నిర్లక్ష్యం చేయకుండా కరోనా టెస్టు చేయించు కోవాలని అయన అన్నారు.