చెత్త రహితంగా సికింద్రాబాద్ నియోజకవర్గం : తీగుల్ల పద్మారావు గౌడ్

చెత్త రహితంగా సికింద్రాబాద్ నియోజకవర్గం :  తీగుల్ల పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్, సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గంలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాముఖ్యత కల్పించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. వర్షాల వల్ల రోగాలు ప్రబలకుండా జాగ్రతలు పాటించాలని పద్మారావు గౌడ్ సూచించారు. శానిటేషన్ విభాగం కొత్తగా సమకూర్చిన 11 చెత్త తరలింపు వాహనాలను పద్మారావు గౌడ్ సోమవారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప సభ పతి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ 25 కొత్త వాహనాలు సికింద్రాబాద్ సర్కిల్ కు సమకురాయని తెలిపారు. నాలా ల పరివాహక బస్తీ ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పద్మారావు గౌడ్ అధికారులకు సూచించారు. డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి కంది శైలజ, శ్రీమతి లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ రవీందర్ గౌడ్, అధికారులు శ్రీమతి గీత, ఇతర నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.