దళితులంతా దళిత బాంధవుడు కేసీఆర్ వెంటే: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

దళితులంతా దళిత భాందవుడు కేసీఆర్ వెంటే: రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్  హైదరాబాద్: రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లోని అదేవిధంగా శంషాబాద్, గండిపేట్ మండలాల నాయకులు 100 వాహనాలలో స్వచ్చందంగా హుజురాబాద్ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వెళుతున్న వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ దళితబంధు పథకంతో ప్రతిపక్షాలు బేజారయ్యాయని ఆయన అన్నారు, దళితులంతా ముఖ్యమంత్రి కేసీఆర్  వెంటే ఉన్నారని ప్రకాష్ గౌడ్ అన్నారు.రాబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరెన్ని కుట్రలు చేసిన తాము హుజురాబాద్ లో జెండా ఎగురవేయడం కాయం అని ప్రకాష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పక్ష పార్టీలు తెరాస ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకువచ్చేలా మాట్లాడుతున్నారని కానీ తెలంగాణ ప్రజలు వారిని నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటే ఉన్నారని ప్రకాష్ గౌడ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published.