వినాయక చవితిని పర్యావరణాన్ని కాపాడేలా జరుపుకోవాలి: ఉప సభాపతి పద్మారావు గౌడ్

వినాయక చవితిని పర్యావరణాన్ని కాపాడేలా జరుపుకోవాలి: ఉప సభాపతి పద్మారావు గౌడ్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: కరోనా నేపథ్యంలో మట్టి గణేష్ ని పూజించి, నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి ఎంతో మంచిదని తెలంగాణ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు . 100 మంది స్థానికులకు మట్టి గణేష్ విగ్రహాలను అయన అందజేశారు. మట్టి గణేష్ ని పూజించడం ఎంతో మంచిదని వినాయక నిమజ్జనం చేయడం వల్ల ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని ఉప సభాపతి తెలిపారు. ప్రజలందరూ మట్టి వినాయకులను వినియోగించాలని పద్మారావు గౌడ్ కోరారు. రసాయనాలతో తాయారు చేసే గణనాధులను చెరువుల్లో నిమజ్జనం చేయడంతో పర్యావరణానికి హాని కలుగుతుందని అందువల్లే ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని పద్మారావు గౌడ్ సూచించారు. ఈ కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు. గణేశుని ఆశీస్సులతో కరోనా మహమ్మారి ఈ భూభాగం నుండి పూర్తిగా తొలగిపోవాలని పద్మారావు గౌడ్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆ గణేశునికి పూజిస్తున్నాని ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకుడు తీగుళ్ల కిషోర్ గౌడ్ రాజేష్ గౌడ్,Dr. గంగాధర్, ప్రవీణ్ గౌడ్ ,ప్రకాష్, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.