సికింద్రాబాద్ లో మెగా జాబ్ మేళా..

సికింద్రాబాద్ లో మెగా జాబ్ మేళా..

ఆర్.బి.ఎం సికింద్రాబాద్: ఏప్రిల్ 7న సికింద్రాబాద్ లో మెగా జాబ్ మేళా సెట్విన్ తో పాటు వివిధ సంస్థల సహకారంతో సికింద్రాబాద్ లో ఈ నెల 7వ తేదిన ఓ మెగా జాబ్ మేళా నిర్వహిస్తునారు. సితాఫలమండీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నిర్వహించే ఈ జాబ్ మేళా లో 35 కు పైగా పేరొందిన ప్రయివేటు, కార్పోరేట్ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ జన్మ దినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళా లో పదో తరగతి, ఇంటర్,డిప్లొమా, బీ ఫార్మసీ, హోటల్ మ్యానేజ్మెంట్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీ జీ, ఎం బీ ఏ , ఎం సీ ఏ వంటి అన్ని విద్యార్హతల వారికి అనువైన ఉద్యోగాలు కల్పిస్తున్నారు. కనీసం రెండున్నర వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా జరుపుతున్న ఈ జాబ్ మేళా ను ప్రధానంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అడ్డగుట్ట, మెట్టుగూడ, తార్నాక, సితాఫలమండీ, బౌద్ధనగర్ మునిసిపల్ డివిజన్లకు చెందిన నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోగలరని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 7 వ తేది ఉదయం నుంచి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ వద్ద స్పాట్ రిజిస్ట్రేషన్ లకు అవకాశం కల్పిస్తారు.

Leave a Reply

Your email address will not be published.