తెరాస పార్టీ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరిన పూలపల్లి గ్రామానికి చెందిన తెరాస కార్యకర్తలు..

తెరాస పార్టీ నుండి కాంగ్రెస్ లోకి భారీగా చేరిన పూలపల్లి గ్రామానికి చెందిన తెరాస కార్యకర్తలు..

ఆర్.బి.ఎం డెస్క్: నవాబ్ పేట్ మండలంలోని పూలపల్లి గ్రామానికి చెందిన తెరాస కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు పోలీస్ మధుసూధన్ రెడ్డి ,మండల అధ్యక్షలు మేడిపల్లి వెంకటయ్య మాట్లాడుతూ నూతన పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాక గ్రామస్థాయిలో అనూహ్యంగా
కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోందని భవిష్యత్తులో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ మాటలు ఇక నమ్మరని, కెసిఆర్ మోసాన్ని ప్రజలు పసిగట్టారు అని ఈ సందర్భంగా తెలిపారు. తెరాస పార్టీని విడి కాంగ్రెస్లో చేరిన వారు M.మల్లారెడ్డి,గుడిసె రాములు,శ్రీశైలం, బాలరాజు,మాణిక్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రాజు, విట్టల్ రెడ్డి ,ప్రభాకర్ రెడ్డి, ఇ కర్ణాకర్ రెడ్డి ,అంతయ్య, రామ్ రెడ్డి, ఇ. కృష్ణారెడ్డి, డి. మహిళా నాయకురాలు పార్వతమ్మ, నరసమ్మ, యాదమ్మ ,రుక్కమ్మ, తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బానూరీ ఉపేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఇక్బాల్,ఉపాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి,అజయ్ కుమార్ ,ఎలిమెల సుధాకర్ రెడ్డి, ఆర్కతల ఉపసర్పంచ్ ఇందురిపాటి సంగారెడ్డి ,మాదకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు గణపురం ప్రసాద్, బ్రహ్మా రెడ్డి, మనిచందు,వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *