ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతాం: బండి సంజయ్,రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు

ప్రగతిభవన్‌, ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతాం: బండి సంజయ్,రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు హీట్ ఎక్కిస్తున్నాయి. అధికార,ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒక్కరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తుకుపోసుకుంటున్నారు.ముక్యంగా బీజేపీ.తెరాస నాయకులూ ఒకరిపై మరొక్కరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ తలపెట్టిన బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అడుగు ముందుకు వేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 లో జరగబోయే ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అయన అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వెంటనే నగరంలో ఉన్న ప్రగతి భవన్,కెసిఆర్ ఫామ్‌హౌస్‌లను లక్ష నాగళ్లతో దున్ని ప్రజలకు పంచుతాం అని బండి సంజయ్ ప్రభుత్వానికి సవాల్ విసిరాడు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చే ఎన్నికలో ఓడిపోతామనే భయం పట్టుకుంది అని అయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యను పరిస్కహరిస్తాము అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అది ఎప్పటి వరకు ఆవుతుందో కూడా చెప్పలేని పరిస్థిలో అయన ఉన్నారని బండి సంజయ్ అన్నారు. అడవి ప్రాంతాల్లో ఉండే గిరిజనులు సాగు చేసుకుంటుంటే వారిని అమానుషంగా ఇబ్బందులకు గురిచేసున్నారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి సరిగ్గా నెరవేర్చలేదని అయన అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని పేద ప్రజలను కెసిఆర్ మోసం చేశాడని అయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కో దళితుడికి పది లక్షల కాకుండా ముపై లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాని డిమాండ్ చేసారు. రాష్ట్రంలో ఉన్న దళితుల్లో ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని బండి సంజయ్ ప్రభుత్వాని ప్రశ్నించారు.

బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్లో 125 అడుగుల భారీ అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం ఆ ఫైల్ మేడే పెడతాం అని బండి సంజయ్ అన్నారు. 2023 వచ్చే ఎన్నికలో తెలంగాలో పేదల రాజ్యం రావాలి అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు కెసిఆర్ లాఠీలకు తూటాలకు భయపడరని బండి సంజయ్ బడుగుల ఆత్మగౌరవ పోరు ధర్నాలో అన్నారు.

Leave a Reply

Your email address will not be published.