బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు లభించని పోలీసుల అనుమతి..

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు లభించని పోలీసుల అనుమతి..

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ రథ సారధి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసుల అనుమతులు ఇప్పటి వరకు లభించలేదు. బండి సంజయ్ చేయబోయే ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతులు ఇవ్వాలని కోరుతు గత వారం డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి లేఖ అందజేసిన బీజేపీ బృందం. తాము డిజిపి కి లేఖ ఇచ్చి వారం అవుతున్న పాదయాత్రకు ఇంకా పోలీసుల నుండి అనుమతులు రాలేవని బీజేపీ వర్గాలు అంటున్నాయి. శనివారం రోజు ప్రారంభమైయ్యే ప్రజా సంగ్రామ యాత్ర కోసం బీజేపీ పార్టీ భారీ ఏర్పాట్లను చేసుకుంటుంది. రేపు(శనివారం) ఉదయం నగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వద్ద నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభిస్తారు.బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించే ముందు భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 9 :30 గంటలకు యాత్ర ప్రారంభిస్తారు . చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో బండి సంజయ్ ప్రసంగిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా బండి సంజయ్ నాలుగు విడతలుగా పాదయాత్ర చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *