టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: అర్వింద్‌

టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు: అర్వింద్‌

ఆర్.బి.ఎం  నిజామాబాద్: టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదనినిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్‌ గ్రామంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదని అర్వింద్‌ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published.