రాజు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకురాని కుటుంబసభ్యులు

రాజు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకురాని కుటుంబసభ్యులు

ఆర్.బి.ఎం వరంగల్: చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు మృతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి రైల్వే పోలీసులు అప్పగిస్తామన్నారు. ఇప్పటివరకు రాజు కుటుంబం నుంచి పోలీసులకు ఎటువంటి సమాచారం రాలేదని చెబుతున్నారు. రాజు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబసభ్యులు ముందుకురాలేదు. చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం రైల్వే సిబ్బంది కంట పడింది. అనుమానం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి చేతిపై మౌనిక అని పచ్చబొత్తు ఉంది. దీంతో చనిపోయింది రాజే అని పోలీసులు నిర్ధారించారు.

Leave a Reply

Your email address will not be published.