రేవంత్‌రెడ్డి మంత్రాంగం.. కాంగ్రెస్‌లోకి డీఎస్?

రేవంత్‌రెడ్డి మంత్రాంగం.. కాంగ్రెస్‌లోకి డీఎస్?

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ ఎంపీ డి.శ్రీనివాస్‌ తిరిగి స్వంత గూటికి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌‌లో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. అయితే కొంత కాలానికే సీఎం కేసీఆర్‌కు, డీఎస్‌కు మధ్య దూరం పెరిగిపోయింది. డీఎస్ కూడా టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ పెరిగింది. ఆయన వరుసగా కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీని వీడిని నేతలను వరుసగా కలుస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎస్‌ను తిరిగి తన సొంతగూటికి తెచ్చే ప్రయత్నాలు రేవంత్‌రెడ్డి చేస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల డీఎస్ కింద పడి చెయ్యి విరిగింది. ఆయనను పరామర్శించేందుకు రేవంత్‌ వెళ్లారు. డీఎస్‌ తనకు చాలా దగ్గర మనిషి అయినందునే పలకరించేందుకు వచ్చానని రేవంత్ తెలిపారు. తనను పరామర్శించేందుకు రేవంత్‌ రావడం సంతోషం కలిగించిందని డీఎస్ అన్నారు. ఈ సందర్భంగా మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా డీఎస్‌ను రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. రేవంత్‌ టీపీసీసీ అధ్యక్షుడు కాగానే డీఎస్‌ పెద్ద కుమారుడు సంజయ్‌ వెళ్లి ఆయనను కలవడం, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. అధిష్ఠానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే త్వరలోనే డీఎస్‌ కూడా సొంత గూటికి చేరే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published.