రేవంత్ అన్న ఆదేశిస్తే కాంగ్రెస్‌లో అడుగేస్తా: బండ్ల గణేష్

రేవంత్ అన్న ఆదేశిస్తే కాంగ్రెస్‌లో అడుగేస్తా: బండ్ల గణేష్

ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదేశిస్తే తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తానని ప్రకటించినట్లు సమాచారం. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని బుచ్చిగూడ గ్రామ మాజీ సర్పంచ్‌ తాండ్ర సులోచనమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ నేపథ్యంలోనే రేవంత్‌రెడ్డి, మల్లురవి, బండ్ల గణే‌ష్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డి పార్టీలో అత్యంత కీలక పదవిలో ఉన్నందున మీరు కూడా పార్టీలో యాక్టీవ్‌ రోల్‌గా ఉండాలని మల్లురవి బండ్ల గణేష్‌కు సుచించారు. రేవంత్‌ అన్న ఆదేశిస్తే అడుగు ముందుకు వేస్తానని బండ్ల గణేష్‌ సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండ్ల గణేష్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రాజేంద్రనగర్‌, జూబ్లీహిల్స్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన నిరాశ మిగిలింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడటంతో బండ్ల గణేష్‌ పార్టీ కార్యక్రమాలు, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *