రామకృష్ణమఠంలో యువతకు
శౌర్య రెసిడెన్షియల్ క్యాంప్
హైదరాబాద్ : రామకృష్ణ మఠంలో ఈ నెల 27 నుంచి యువతకు ‘శౌర్య’ పేరిట క్యాంప్ జరగనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్కులు అర్హులు. యువకులకు రెసిడెన్షియల్ క్యాంప్ ఉంటుందని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద తెలిపారు. శౌర్య క్యాంపులో యువతకు స్వామి వివేకానంద సందేశంపై ప్రత్యేక తరగతులుంటాయి.ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందేలా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బృంద చర్చలతో పాటు ప్రశ్న-జవాబుల సెషన్ కూడా ఉంటుందని బోధమయానంద తెలిపారు. యోగ, ధ్యానం, భక్తి సంగీతంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. క్యాంపునకు హాజరయ్యే యువత తెల్లటి దుస్తులు ధరించాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 91772 32696 నంబరు ద్వారా సంప్రదించగలరని నిర్వాహకులు సూచించారు.
రామకృష్ణమఠంలో యువతకు శౌర్య రెసిడెన్షియల్ క్యాంప్
