ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ పట్టాలు అందుకున్న శ్రీలక్ష్మీ, యాదగిరి దంపతులు

*ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్‌ పట్టాలు అందుకున్న శ్రీలక్ష్మీ, యాదగిరి దంపతులు*

హైద్రాబాద్‌ ఘట్కేసర్ పట్టణానికి చెందిన టి. శ్రీలక్ష్మి, యాదగిరి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు. చరిత్ర విభాగంలో శ్రీలక్ష్మి, తెలుగు విభాగంలో యాదగిరికి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేసింది. వీరిద్దరినీ యూనివర్సిటీ ఆర్ట్స్‌
కాలేజి ప్రిన్సిపాల్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ అర్జున్‌రావు కుతాడి అభినందించారు.

*Dr. శ్రీలక్ష్మి*

మూడు సంవత్సరాలలోనే తన రీసెర్చ్‌ను కంప్లీట్‌
చేయడం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర విభాగంలోనే అరుదైన సంఘటన అన్నారు. సహజంగా ఒక రీసెర్చ్‌ స్కాలర్‌
తన పరిశోధనను మూడు నుండి ఐదు సంవత్సరాల కాలపరిమితిలో ముగించాలి. కానీ శ్రీలక్ష్మి తన రీసెర్చ్‌ను
మూడేళ్ళలోనే పూర్తిచేసి, డాక్టరేట్‌ పట్టా అందుకోవడం అలాగే గురుకుల డిగ్రీ కాలేజీ హిస్టరీ లెక్చరర్‌గా గవర్నమెంట్‌
ఉద్యోగం సాధించడం ఆదర్శప్రాయమని ప్రిన్సిపాల్‌ అర్జున్‌రావు కొనియాడారు.

నిరుపేద కుటుంబంలో తల్లి తొట్టెంపూడి ప్రమీలారాణి, తండ్రి తొట్టెంపూడి సుబ్బారావుకు హైదరాబాద్‌లో
జన్మించిన శ్రీలక్ష్మి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం. ఏ. హిస్టరీ పూర్తిచేశారు. యుజీసీ 2019లో నిర్వహించిన
నెట్‌ పరీక్షలో (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) ఉత్తీర్ణత సాధించి, రీసెర్చ్‌ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు. తర్వాత
2020వ, సంవత్సరం చరిత్ర శాఖలో తన పరిశోధన ప్రారంభించారు. సీనియర్‌ ప్రొఫెసర్‌ అర్జున్‌రావు
కుతాడి పర్యవేక్షణలో (గైడ్‌) “ది రోల్‌ ఆఫ్‌ దళిత్‌ విమెన్‌ – సోషల్‌ రిఫార్స్స్‌, సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్స్‌ అండ్‌
తెలంగాణ మూవ్‌మెంట్‌” అనే టాపిక్‌తో శ్రీలక్ష్మి తన పరిశోధన సిద్ధాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించారు. ఈ పరిశోధనకుగాను ఉస్మానియా యూనివర్సిటీ శ్రీలక్ష్మికి డాక్టరేట్‌ పట్టాను ప్రధానం చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ అస్తిత్వ చరిత్రను పలుకోణాల్లో రాసే ప్రయత్నం రచయితలు,
పరిశోధకులు చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ నిర్మాణంలో పునాదిరాల్లుగా మిగిలి, ఏ గుర్తింపుకు
నోచుకోని దళిత స్రీలకు చరిత్రలో స్థానం కల్పించడానికి పరిశోధకురాలు శ్రీలక్ష్మి చేసిన ప్రయత్నం
విజయవంతమైందని గైడ్‌, ఆర్ట్స్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ అర్జున్‌రావు, హిస్టరీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌
ప్రొఫెసర్‌ లావణ్య, ప్రా. ఇందిర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రమేష్‌ అభినందించారు.

*Dr. యాదగిరి*

వికారాబాద్ జిల్లా, తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్‌ 1లో తెలుగు ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తూ పరిశోధన పూర్తి చేయడం ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్థి అనే నానుడిని
నిరూపించారని యాదగిరిని ప్రిన్సిపాల్‌ అర్జున్‌రావు కొనియాడారు.

సాధారణ కుటుంబంలో తల్లి పైళ్ళ అనంతమ్మ, తండ్రి పైళ్ళ నర్సిములుకు వికారాబాద్‌ జిల్లా, యాలాల
మండలం నాగసమందర్‌ గ్రామంలో జన్మించిన యాదగిరి ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ. తెలుగు
పూర్తిచేశారు. యుజీసీ నిర్వహించే నెట్‌ పరీక్షలో (నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) 2012లో ఉత్తీర్ణత సాధించారు.
అదే సంవత్సరం ప్రభుత్వ తెలుగుభాషా ఉపాధ్యాయుడుగా ఉద్యోగంలో చేరారు. తర్వాత 2017వ, సంవత్సరం
తెలుగు శాఖలో తన పరిశోధన ప్రారంభించారు. డాక్టర్‌ అన్నదానం వేంకట సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో
(గైడ్‌) “భండారు సదాశివరావు సాహిత్యం – సమగ్ర పరిశీలనం” అనే టాపిక్‌తో యాదగిరి తన పరిశోధన
సిద్దాంత గ్రంథాన్ని యూనివర్సిటీకి సమర్పించారు. ఈ పరిశోధనకుగాను ఉస్మానియా యూనివర్సిటీ యాదగిరికి
డాక్టరేట్‌ పట్టాను ప్రధానం చేసింది.

భండారు సదాశివరావు వరంగల్‌ పట్టణానికి చెందిన వారు. స్వాతంత్ర్య సమరయోధులు జాతీయవాద
కవి. వీరు 22కు పైగా రచనలు చేశారు. జాతీయ సాహిత్య పరిషత్‌ అనే సంస్థను తెలుగు ప్రాంతంలో
ప్రారంభించి, దేశ భక్తి సాహిత్యాన్ని కవులను సదాశివరావు తీర్చిదిద్దారు. 1925లో జన్మించిన సదాశివరావు
శతజయంతి ఉత్సవాలకు చేరువలో ఉన్న సమయంలో సదాశివరావు జీవితం వారి సాహిత్యంపై పరిశోధన
(గ్రంథం రావడం జాతీయవాదులకు ఆనందాన్ని కలిగించే అంశమని ఉస్మానియా యూనివర్శిటీ తెలుగు
డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ సాగి కమలాకర శర్మ, బీవోఎస్‌ ప్రా. ఏలే విజయలక్ష్మీ ప్రా. చింతకింది కాశీం,
ప్రొ. సూర్యాధనుంజయ్‌, ప్రా. రఘు అభినందించారు.

శ్రీలక్ష్మి డాక్టరేట్‌ పట్టాతో
పాటు డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం అలాగే యాదగిరి డాక్టరేట్ పట్టా సాధించినందుకు తల్లిదండ్రులు, అత్తామామలు, ఇతర కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.