పులిమామిడిలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు

పులిమామిడిలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు

ఆర్.బి.ఎం పులిమామిడి:  నవాబుపేట్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో  బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.

  ఈ సందర్భంగా యువత మట్లాడుతూ.. ముస్లిం రాజ్య పరిపాలనలో హిందువుల పట్ల నిరంకుశంగా మత మార్పిడి కొనసాగుతున్న సందర్భంగా హిందూ సామ్రాజ్య విస్తరణపై ఛత్రపతి శివాజీ చూపిన చోరువతో నేటి దేశం హిందూ దేశంగా కొనసాగుతుందని వారు అన్నారు. తన తల్లి జీజీయ బాయి స్ఫూర్తితో హిందువుల ఐక్యత, విస్తరణ కోసం బీకర మైన యుద్ధాలు చేసి ముస్లిం రాజుల నుంచి హిందువులను కాపాడిన ఘనత ఛత్రపతి శివాజీదే అన్నారు. ప్రస్తుతం భారత దేశంలో ఉగ్రవాదం పెరిగిపోవడానికి దేశంలోని రాజకీయ పార్టీలలో ఐక్యత లేకపోవడమేనని వారు అన్నారు. హిందూవులు శాంతి కాముకులని, శాంతి, సహనంతో ఉండటంతోనే పరాయి దేశస్థులు పెట్రేగిపోతున్నారని  పాకిస్థాన్‌ లాంటి దేశాలను ఉపేక్షిస్తే మన దేశానికే ప్రమాదమన్నారు. ప్రతి భారతీయ పౌరుడు ముందుగా దేశ భద్రతకు పాటుపడుతూ దేశ హితం కోసం ముందు వెళ్లాలని సూచించారు. యువత చెడు మార్గంలో కాకుండా హిందూ సమాజం ఉద్దరణ కోసం పాటుపడుతూ,సంస్కృతి సాంప్రాదాయాలను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారీగా యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *