పులిమామిడిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా: రవీందర్ రెడ్డి
ఆర్.బి.ఎం, పులిమామిడి: నవాబుపేట్ మండల పరిధిలోని పులిమామిడి గ్రామంలో హిందువుల ఆరాధ్యదైవం ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తానని అదే గ్రామానికి చెందిన రవీందర్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం యువతకు ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. ఛత్రపతి శివాజీ సాహసం,ధైర్యం, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు నేటి యువతకు ఎంతగానో స్ఫూర్తినిస్తుందని రవీందర్ రెడ్డి అన్నారు. ఆయన సాధించిన విజయాలు అసాధారణమైనవని అన్నారు. ఛత్రపతి శివాజీ చిన్న వయస్సులోనే స్వరాజ్యాన్ని స్థాపించి మొఘల్ సామ్రాజ్యానికి సవాలు విసిరారనిఅన్నారు. ఆయన తన సైన్యానికి క్రమశిక్షణను నేర్పించి వారిని సమర్థవంతంగా ఉపయోగించారని రవిందర్ రెడ్డి తెలియజేశారు. శివాజీ మహారాజ్ పరిపాలనలో ప్రజలకు న్యాయం అందించారని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. నేటి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఛత్రపతి శివాజీ లాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని తమ లక్ష్య సాధన కోసం ముందుకు సాగాలని రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.
సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రవీందర్ రెడ్డి..
ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రవీందర్ రెడ్డి తనదైన శైలితో ముందుకు సాగుతున్నారు. ప్రతి క్షణం సమాజ హితం కోరే వ్యక్తి ఆయన. తన స్వగ్రామం, ఇతర గ్రామాల్లో కూడా ఆయన ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించారు. ఎవరికి ఆపద వచ్చిన ఆయన ముందుండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. రోజు రోజుకి రవీందర్ రెడ్డికి గ్రామ,మండల స్థాయిలో ఆదరణ పెరిగిపోతోంది. ఎలాంటి లాభం ఆశించకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్న రవీందర్ రెడ్డికి ఇప్పటికే పలువురు ప్రముఖుల నుండి ప్రశంశలు కూడా అందుతున్నాయి. ప్రజల పక్షపాతి రవీందర్ రెడ్డిని రాజకీయ నాయకులు స్ఫూర్తిగా తీసుకుంటే రాష్ట్రం, దేశం మరింత బాగుపడుతుందని యువత కోరుతున్నారు.