రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో ఉద్యమకారుడు శుభప్రద్ పటేల్..

రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో ఉద్యమకారుడు శుభప్రద్ పటేల్..

రంగారెడ్డి: తెలంగాణ ఉద్యమం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ. మలిదశ ఉద్యమానికి ఉస్మానియా ఊపిరి పోసింది. ఉస్మానియాతో ప్రభావం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ఎంతో ఉంది. హైదరాబాద్ కేంద్రం జరిగిన ప్రతి ఆందోళనలో రంగారెడ్డి జిల్లా పాత్ర ఎంతో ఉంది. ఎందుకుంటే ప్రతి ఆందోళన వెనుక రంగారెడ్డి జిల్లా క్రియాశీలమైన పాత్ర వహించింది. జిల్లాపై ఉద్యమ ప్రభావం ఉండదు అనుకుంటున్న సమయంలో కూడా రంగారెడ్డి జిల్లాలో సకల జనులు కెరటంలా ఎగిసిపడ్డారు. రంగారెడ్డి జిల్లా అనేక ఉద్యమ పోరాటాలకు కేంద్రబిందువు అయింది. వికారాబాద్ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు శుభప్రద్ పటేల్. ఈయన వికారాబాద్ కేంద్రంగా అనేక ఉద్యమాలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శుభప్రద్ పటేల అలుపెరగని పోరాటం చేశారు. ఆయనపై అనేక అక్రమకేసులు పెట్టారు. పోలీసులు ఎన్నిసార్లు అరెస్ట్ చేసిన ఎన్ని కేసులు నమోదు చేసిన అయన మాత్రం ఉద్యమాన్ని అపలేదు. ఆయన ప్రభావం రంగారెడ్డి జిల్లాలోని యువతపై ఉంది. ఆ ప్రభావం ఎంతంటే ఆయన పిలుపుతో కొన్నివేల మంది ఆయన బాటలో నడిచారు. అంతేకాదు ఒవైపు తెలంగాణ ఉద్యమం, మరోవైపు రాజకీయ పోరాటంలో శుభప్రద్ పటేల్ పాత్ర చాలా గొప్పది. రాజకీయ పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఆయన అత్యంత సన్నిహితుడయ్యారు. కేసీఆర్ పిలుపుతో పటేల్ ఎన్నో కార్యక్రమాలు చేశారు. పటేల్ తెగువను, చొరవను చూసిన కేసీఆర్.. ‘ఉద్యమపులి’ అని సంబోంధిన సందర్భాలెన్నో ఉన్నాయి.

అయితే వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో రంగారెడ్డి జిల్లా నుండి చాలా మంది టీఆర్ఎస్ నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మంగా తీసుకుంది. ఎందుకంటే 2015లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే టీఆర్‌ఎస్ ఇప్పటి నుంచి పావులు కదుపుతోంది. పట్టభద్రులు ఉద్యోగవర్గాలు, ఉపాధ్యాయులు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉండటం వల్ల అర్హులందరిని ఓటరు జాబితాలో చేర్పించడం ఇప్పుడు కాస్త కష్టంగా మారనుంది.

అయితే శుభప్రద్ పటేల్ విద్యార్ధి నాయకుడిగా, న్యాయవాదిగా ఉండటం వల్ల అయనకు ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆయను మద్దతుగా నిలిచి గెలిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే శుభప్రద్ పటేల్ తెలంగాణ రాష్ట్రం ఎర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పదవి ఆశించలేదు. ఎలాంటి లభాపేక్ష లేకుండా పార్టీ బలోపేతం కోసం శుభప్రద్ పటేల్ శ్రమించారు. అధిష్టానం తనకు ఏ బాధ్యత అప్పగించిన కష్టపడి పార్టీ బలోపేతం కోసం పాటు పాడుతానాని శుభప్రద్ పటేల్ ఎన్నో సందర్భాలలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.