ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల.. అన్నదానం చేసిన టీఆర్‌ఎస్‌వీ నాయకుడు
ఆర్.బి.ఎం ఇబ్రహీంపట్నం: ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని సంతోష్ థియేటర్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. ఎన్టీఆర్ అభిమానసంఘం నాయకులు కప్పరి రాజు, టీఆర్‌ఎస్‌వీ నేత జగదీశ్వర్‌ల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. మూడున్నరేళ్ల తర్వాత తమ అభిమాన నాయకుడు ఎన్టీఆర్ వెండితెరపై కనిపించడంతో అభిమాన సంఘం తరపున అన్నదానం చేశామని నిర్వాహకులు తెలిపారు. సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం కోసమే ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. చాలాకాలం తర్వాత ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగిందని, కుటుంబ సమేతంగా మార్నింగ్ షో చూశామని ప్రేక్షకులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులు మళ్లీ సినిమా చూడడానికి థియేటర్లకు వస్తున్నారు.
