పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాటపై పోలీసుల అభ్యంతరం.. ఇంతకంటే గొప్ప పదాలు దొరకలేదా అంటూ..
ఆర్.బి.ఎం డెస్క్ హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రంలోని పాటపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అని తమకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు విరగొట్టామని ఈస్ట్ జోన్ జాయింట్ సి పి రమేష్ రెడ్డి ట్విట్టర్లో తెలిపారు. భీమ్లా నాయక్ పాట రాసిన రచయిత కు పోలీసుల గురించి వివరించడానికి ఇంతకంటే గొప్ప పదాలు దొరకలేదా అంటూ రమేష్ రెడ్డి ప్రశ్నించారు.ఆ పాటలోని పదాలు తెలంగాణ పోలీసులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఈస్ట్ జోన్ జాయింట్ సి పి రమేష్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు.